విహారి - ది ట్రావెలర్



 ఊటీ బొటానికల్ గార్డెన్ 
రచన - లాస్య రామకృష్ణ 



ఊటీలోని అందమైన పర్యాటక ఆకర్షణలలో అతి ముఖ్యమైనది చిన్న కొండపై ఉన్న బొటానికల్ గార్డెన్. 55 ఎకరాల మేరకు విస్తరించబడిన ఈ బొటానికల్ గార్డెన్ 1847 లో మార్కేస్ అఫ్ ట్వీడలీ చేత స్థాపించబడింది. ఈ గార్డెన్ తమిళనాడు ప్రభుత్వంకి చెందిన ఉద్యానవన శాఖచే పరిరక్షింపబడుతోంది. 

ఈ గార్డెన్ లో అందమైన మొక్కలు అలాగే చెట్లు ఉన్నాయి. ఇవి దేశం లో ని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడినవి. వీటిలో కొన్నిరకాల ఔషద మొక్కలు కూడా కలవు. ఈ గార్డెన్ వివిధ విభాగాలుగా విభజించబడినది. న్యూ గార్డెన్, లోయర్ గార్డెన్ మరియు ఇటాలియన్ గార్డెన్ లు అందులో ప్రధానమైనవి. వీటిలో దాదాపు వేయి రకాల మొక్కలు, చెట్లు, ఔషధ మొక్కలు, విదేశీ, అడవి మరియు బోన్సాయి మొక్కలు కలవు. ఈ బొటానికల్ గార్డెన్ వివిధ రకాల అరుదైన చెట్లకి స్థావరం. కార్క్ ట్రీ, మంకీ పజిల్ ట్రీ మరియు పేపర్ బార్క్ ట్రీ వీటిలో కొన్ని.  అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో ఉన్న పురాతన చెట్టు యొక్క ఖాండం ద్వారా ఈ చెట్టు దాదాపు 20 మిలియన్ సంవత్సరాల పురాతనమైనది గా భావించబడుతోంది. ఇక్కడున్న ఇటాలియన్ గార్డెన్ లో అనేక రకాల జల వృక్ష జాతులు కలువ చెరువు లో ఉన్నాయి. 

ఈ బొటానికల్ గార్డెన్ లో ని మరి యొక ఆసక్తి కరమైన అంశం నీలగిరి లో ని గిరిజనుల జీవన శైలిని తెలియచేసే తోడా హిల్. ప్రతి సంవత్సరం మే నెలలో, ఊటీ బొటానికల్ గార్డెన్ లో ని ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తారు. ఇందులో వివిధ రకాల పుష్పాలు అలాగే అరుదైన పుష్పాలను ప్రదర్శనలో ఉంచుతారు. ఊటీ ని సందర్శించే ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. 


*****

ఈ సంచికలోని ఇతర రచనలు 

1 comment:

  1. సృజన పత్రిక చాలా బాగుంది. బ్లాగులోకానికి విన్నూత్న ప్రయోగం అందించిన మీకు కృతజ్ఞతలు. ఈ పత్రిక పదికాలాలు...కాదు కాదు అనంతకాలాలపాటు వర్ధిల్లాలని కోరుకుంటూ

    ReplyDelete